విరామం స్వేచ్ఛ కై
విరామం స్వేచ్ఛ కై
ప్రపంచానికి కనపడని పోరాటాలు ముందు ఉన్న నీకు..
చుట్టూ ఉన్న నిశబ్దం లో ఎ శాంతి కనిపించని నీకు..
భయంకర శబ్దాలతో అలసిపోయిన నీ ఆత్మకు..
వెంట వీడనన్న గాయాలతో భారం అయిన నీ గుండెకు..
ఊహకి అందని ఆలోచనలతో బాధిస్తున్న నీ మనసుకు..
నవ్వే నవ్వు వెనుక ఇబ్బంది పడ్తున్న నీ కన్నీలకు..
అనుక్షణం దినచర్య లో భాగమైన ఈ పోరాటం నుండి బయటకి రావాలి అని ఘోషిస్తుoది..
ఎందుకు శిక్షితునాయో అనే ఒక అంతు చిక్కని ప్రశ్న వెంబడిస్తుంది..
ఎంత ఒదార్చిన తగ్గని ఇ కష్టం ఆవేదనతో ఇక చాలు అంటోంది..
ఇక నువు మోయలేవు అని తెలిసిన, జాలి పడని ఇ కాలం కొంత వరకు ఆగిపోవలి అని తపిస్తుంది..