కళ్ళు
కళ్ళు


నీ ప్రశ్నలకు సమాధానం నా కళ్లు.....
ఆ కళ్లకే నువ్వు మాటలు నేర్పగలిగితే......
నా కళ్ల ముందు ఉన్న నీ రూపం
నా గుండెల్లో నిండింది నీ రూపమే అని చెప్పేస్తుందేమో.......
నా మనసులో దాగిన నీ పై మౌనం
నా మనసంతా నువ్వేనని చెప్పేస్తుందేమో.....
నా అనే నేను నుండి
నా అనే నువ్వుగా మారానని చెప్పేస్తుందేమో......
ఎందుకంటే.....
మనసుతో నిండిన కళ్లను తెలుసుకోవటం చాలా సులభం కాబట్టి.......
ఆ కళ్లనే మనం నమ్ముతాం కాబట్టి......