కలల పంట
కలల పంట
నీటిలో కలువవే మా పాప నువ్వు
నింగిలో వెన్నెలై వెలుగు నీ నవ్వు
కోటి తారకల తళుకులే రువ్వు
రతనాల రాశుల తేజమే నువ్వు
తాతయ్య మీసాలు పట్టి లాగేవు
మీ బామ్మ యొడిలోన గంతులేసేవు
మేనత్తలకు నీవు ప్రాణమైనావు
బాబాయితో చిలిపి యాటలాడేవు
కలల పంటగ మాకు పుట్టినావీవు
కలిమి నెంతయో మోసుకొచ్చావు
గృహములో లక్ష్మివై వెలిసియున్నావు
మా కంటిపాపవై యెదగవమ్మా!నీవు.
