ఖజానా ఖాళీ
ఖజానా ఖాళీ


ఖజానా ఖాళీ గుందనీ మందు షాపులు ఓపెను
ఏ రాజులేలినా మార్చరు మా తలరాతను
నీటిసుక్కకు పోక పోయే
మందు సుక్కకు తయారయే
కిలోమీటరు దూరమైనా మండుటెండ కాలుతున్నా
మందంగడి ముందు కొస్తే
శానిటైజర్ ఇస్తుండ్రు
చేతులేమో శుభ్రమాయె
మరి ఆరోగ్యం పాడాయే
గవర్నమెంట్ మందు ముందు కరోనా ఓ లెక్కనా
ఆర్ధికంగా చితకబడిన ప్రభుత్వాల బాగోగులు
ఎన్ని కోట్లు అప్పులు తెస్తామని యోచించిన
మా ప్రభుత్వం...
మందు బాబు లైన మీవల్లే అవుతుందని
మందు షాపులు తెరిచేను...