STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కాళీయుని గర్వభంగము

కాళీయుని గర్వభంగము

1 min
229

17.

చంపకమాల.


అనుపమ శీలమున్ గలిగి యద్భుత వీరపరాక్రమంబుతోన్

ఘనతర కార్యముల్ సలిపి కాలముఁ ద్రిప్పుచు విశ్వరూపిగన్

మునుకొని సజ్జనాత్ములకు ముక్తినొసంగుచు నేలువాడ!నా

మనమున గొల్వు సేయవయ!మంగళదాయక! ప్రేమగన్ హరీ!//


18.

చంపకమాల.


గరళము జిమ్ముచుండె నట కాళియు డాయమునా హ్రదంబులో 

నురగపు ధాటికి హడలి యుస్సుర టంచును బ్రాణభీతితో

పరుగులు బెట్టుచుండి జనవాహిని వేడగ భీతిమాన్పగన్

సరుగున వచ్చితీవు ఘన సర్పపు గర్వము ద్రుంచగన్ హరీ!//



19

చంపకమాల.


బలమగు సర్పమున్ దునిమి పాదము మోపిశిరంబుపై వెసన్

జెలగుచు నృత్యమున్ సలుప జీవముపోవునటంచు భీతితో

నలయుచు వేడగన్ శరణ మాఫణి యార్తిని బాపినావు నిన్ 

దలచిన చాలు పుణ్యమట!తల్చెద నిత్యము భక్తిగన్ హరీ!//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics