STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Classics

జలతరంగిణులు

జలతరంగిణులు

1 min
364

జలజలమని సెలయేరులు ఉరుకుచు

జలజలమని సవ్వడులొనర్చుచు

జలపాతాల హోరును ధిక్కరించె

జావళీలనవి జ్ఞప్తికి తెచ్చె

జారుతూ బండలపై హొయలుపోతూ

జిలుగు వెలుగులు చిమ్ముతూ

జిగేల్మనిపించె రవికిరణములు పడి

జీవనయాన మిదియే యని, ఒనగూడి

జీవమిచ్చు పదార్థముల చేర్చుకొనుచు

జుమ్మనుచు అడ్డంకుల నెదురుకొనుచు

జూపెను మానవాళికి ప్రయాసలనెదుర్కొను తీరును

జూచి తమను, కష్టనష్టములను ఎదుర్కొమ్మని

జీవితమున వెరపన్నది ఉండరాదని

జయము వెరవని వారినే వరించునని

జేగంటలు మ్రోగవలెనన్న వీరత్వము చూపమని

జై జై నినాదములు నీకై ప్రజలంతా చేయుదురని

జగమున నీకు ఎదురే లేకుండునని

జలజల చిరునవ్వుల సవ్వడులతో కదలిపోయె


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics