STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

జీవనదులు

జీవనదులు

1 min
4

జీవనదులు.

(ద్విరదగతి రగడ )


జీవనదులీనాడు జీర్ణదశలను జేర

కావగా రారండి!కళకళతోడ పాఱ 


సరస్వతి నది నాడు సాగించ పయనంబు 

సారవంతమై ధర సాధించెను జయంబు 


నదులలో కలుషితము నాశనంబును తెచ్చు 

వదలదీ గరళంబు పాడుజబ్బులు వచ్చు 


పున్నెముల నిడుచుండు పూజ్యమౌ నదులెల్ల

మన్నులో కలియంగ మంచి జరుగుట కల్ల 


మేలుకొండి!యువతా!మించిపోవు కాలము

కాలకూట విషమును కాల్చి జీవించెదము 


జలరాశి వసుధకే జవసత్త్వముల నిడును 

విలువనెఱుంగ మేలు పృథ్వితా వర్థిలును 


గంగమ్మ పరవళ్లు గలగలా వినుపించు 

పొంగించు సంపదలు పుడమినే పోషించు 


కాపాడుకొందాము!గంగాజలంబులను 

పాపాలు తొలగించు భారతపు దేవతను.//



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics