జీవితం
జీవితం
మనిషి జీవనంలో వస్తాయీ
నాలుగు అధ్యాయాలు
బాల్యం కౌమారం యవ్వనం
వార్థక్యం ఒకటి వెనుక ఒకటి
వస్తూనే ఉంటాయి
జీవిత చరమాంకం వరకు బాల్యాధ్యాయంలో
పాటలు కేరింతలు
ముద్దులు మరిపాలు
చిలిపి పనులు
చిత్రమైన మాటలు
నేర్చుకుంటాం
కౌమారాధ్యయంలో
స్నేహితులుఆటలు
చదువు ప్రపంచాన్ని చదవడం నేర్చుకుంటాం
యవ్వనాథ్యాయంలో
ప్రేమలూ పెళ్లిళ్లు
ఉద్యోగాలు బరువులు
బాధ్యతలు ఆస్తులు
తగాదాలు నేర్చుకుంటాం
వార్ధక్య అధ్యాయంలో
రోగాలు రొస్టులు
చీదరింపులు చీత్కారాలు
ఒంటరి బతుకులు
గత జ్ఞాపకాలు
దేవుళ్ళ తలుపులు
అన్నీ నేర్చుకుంటాం
ఈ అధ్యాయం తోనే
జీవితంముగుస్తుంది
మరో అధ్యాయం మరో జన్మతోనే
మళ్లీ ఈ నాలుగు అధ్యాయాలు పునరావృతం అవుతాయి
అవుతూనే ఉంటాయి జన్మజన్మకు.
