STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

జీవితం

జీవితం

1 min
5


జ్ఞాపకాల అలజడింటి..పండుగ కద జీవితం..! 

మైమరపుల పూలవాగు..వాలుగ కద జీవితం..! 


ఆశ ఎంత అందమైన..శ్వాసంటే ఏంచెప్పను.. 

రేపటితో అల్లుకున్న..నవ్వుగ కద జీవితం..! 


చిరుజల్లై అలరించే..చెలిచూపే మధువులే.. 

కలనైనా ఒక వీడని..ముద్దుగ కద జీవితం..! 


అందాలను అందంగా..చూడగల్గు కనులెక్కడ.. 

అమాయికతా సౌందర్యపు..సరసుగ కద జీవితం..! 


అనురాగపు వనసీమన..విహరించే భాగ్యమేమొ.. 

అనుభవాల సారమైన..వరముగ కద జీవితం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics