జీవితం గమనం
జీవితం గమనం
మృత్యువునా దరికివస్తె పొమ్మంటాను
కష్టాలే ననువరిస్తె రమ్మంటాను
పేదవాడు చెయిసాచితె ఏమంటాను
బడుగువారి సాయానికి ముందుంటాను
ఐశ్వర్యం దూరమైతె ఏమంటాను
లేమితనం ఇంటికొస్తె కలిసుంటాను
దేవుడునాకెదురైతే ఏమంటాను
దానగుణం వరమిస్తే ఇమ్మంటాను
మైనపొత్తి పలుకరిస్తె ఏమంటాను
త్యాగఫలం నాకొరకే తెమ్మంటాను
