జీవ ప్రయాణం
జీవ ప్రయాణం
జీవితమే ప్రయాణం
చేరుటకై మన తుది గమ్యం
సాగటమే సాహసమే ఊపిరిగా
మనతో వచ్చేవారు
మనల్ని వదిలేవారు
మనతో గమ్యం చేరేవారు
తారసపడు క్షణాలు
మనకి జ్ఞాపకాలు
అనుభవాలు
అనుభూతులు
బంధాలు బాధ్యతలు
సుఖ దుఃఖాలు
జీవన ప్రయాణ
మన సహచరులు
అపరిచితులు
అయినవారు
అందరితో బంధాలు
తీరేవరకూ సాగేను
మన జీవ ప్రయాణం
***%%%****
ఫణికిరణ్
