STORYMIRROR

Dr.Kondabathini Ravinder.

Inspirational

4  

Dr.Kondabathini Ravinder.

Inspirational

జాతిపిత

జాతిపిత

1 min
460

     జాతిపిత

     ------------- 

   

  పోరుబందరు నందున పుట్టి నాడు

  స్వేచ్ఛ కోసము పోరును చేసి నాడు

  హింస వాదము వద్దని హితమపలికె

  శాంతి ప్రవచించి నిలిచిన సమత

  వాది

  

  చేత కర్ర పట్టి చేవతో నడిచిన

  నిత్య కర్మయోగి సత్య వ్రతుడు 

  దేశ భక్తిని చాటిన ధీర వరుడు

  జాతిపితగ నిలిచె జగతి నందు


  ఉద్యమాలె యతని ఉఛ్వాస నిశ్వాస

  పల్లె ప్రగతి యతని భావ తపన

  గీత బోధ చేసి రీతి నేర్పెనతడు  

  వెలుగునతని కీర్తి విశ్వమందు

    డాక్టర్. కొండబత్తిని రవీందర్.

    

     నేడు గాంధి జయంతి


   


  

  



Rate this content
Log in

Similar telugu poem from Inspirational