STORYMIRROR

Midhun babu

Classics Fantasy Thriller

4  

Midhun babu

Classics Fantasy Thriller

ఈ వానకు

ఈ వానకు

1 min
8


పూరిగుడిసె ముంచెత్తే..ముచ్చటేల ఈ వానకు..!?

ఈ పుడమిని బాధపెట్టు..కోరికేల ఈ వానకు..!? 


కొండకోనలెల్ల కూల్చ..మనసు ఎలా వచ్చేనో.. 

వడగండ్లతొ వేదించే..వేడుకేల ఈ వానకు..!?


ఏమి గాలి ఏమి హోరు..ఎలా విరగదీస్తున్నది.. 

పిడుగుపాట్ల భీభత్సపు..పండుగేల ఈ వానకు..!?


నిప్పులు చెరిగే ఎండల..వేడికి జవాబిదేనా..

వరదపొంగులెత్త ఇంత..వేదనేల ఈ వానకు..!?


పరుగుతీయు వలపుమేఘ..రాశితాను అవుతోంది..

అమృతప్రేమ జల్లవ్వగ..యాతనేల ఈ వానకు..!? 


Rate this content
Log in

Similar telugu poem from Classics