STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ ఊహే నా జీవితానికి...

ఈ ఊహే నా జీవితానికి...

1 min
315

నలకంత మరకైనా కనరాని నీస్నేహం

కలకూడా నిలవని నాకన్నుల్లో వెలుగై చేరింది.

ఆకాశమంత నీడైన నీతోడు నాకలతల 

కన్నీటినిదాటి ఆశలశ్వాసై తోడైంది

ప్రతిమలుపుల మజిలీలో ఎదురయ్యే నీజ్ఞాపకం

మూసుకున్న ఎద తలుపులను తెరచి

మది నదికిలా నీతలపులత్రోవ చూపింది..

ఏదూరాలు మనదరిచేరని తీరాలకు నీతో 

అడుగడుగునా నా ఊహలపయనం సాగుతుంది...

నేలేవగానే ఓ నీచిరునవ్వు రోజంతా ఆనందంగా

 నేగడపటానికి పవళింపుకి ముందోమాట

రేయంతా నీకలల ఒడిలో నేనిదురించడానికి

మధ్యమధ్యలో ఓచూపునీ తలపులతుంపరలో

 నేతేలియాడడానికి నాకు నువ్వున్నావన్న భరోసా 

చాలు ఈఊహే నాజీవితానికి....

   

     ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance