ఈ ఉదయం
ఈ ఉదయం
ఎన్నాళ్ళ నుంచో వేచిన ఉదయం...
ఇపుడే ఎదురౌతుంటే...
అచ్చరువే మరి...
ఎన్ని వసంతాలు వేచానని మరి...
ఏ దేవుడు కరుణించాడో...
నా దేవేరి నా దరికి వచ్చిన వేళ...
సంబురమే అంబరాన తాకిన...
సంతసాల హేళ...
మయూరమై నాట్యమాడేనుగా నా మది...
ఆకాశాన మెరిసే మెరుపుల వోలే...
తన మేని మెరుపులు నా నయనాలకు....
కనువిందౌతుంటే....
భానోదయ కిరణం వోలే...
తన నుదిట సింధూరం...
నా పాపిట రేఖౌతుంటే...
ఏమి కావాలి ఇంక ఈ జన్మకి...
శిశిరపు ఛాయల జీవితాన...
వసంతమై అడుగిడిన తరుణం...
ఇపుడే ఇక్కడే సొంతమౌతుంటే...
ఇంకేమి చెప్పగలను...
ఏమని వర్ణించనూ...
తన సన్నిధిలో నేనే తనౌతున్న క్షణాలను...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని...!!
