ఈ ప్రాణం నీదే..
ఈ ప్రాణం నీదే..
నివురావని తెలిసీ
నీదారుల్లోనే నాచూపులు పరిచుంచాను...
నీవీనులు తాకదని తెలిసీ
మనసును మౌనగీతంచేసి పాడుతూనే వున్నాను..
నాతలరాతలో లేవని తెలిసీ
నాప్రతిఅక్షరంలోనూ నిన్నే నింపుకుంటున్నాను...
ననుచేరగ రావని తెలిసీ
నామువ్వల్లో నీసవ్వడికై వేచేచూస్తున్నాను
తొలితలపూ నీదే తొలివలపూ నీకే...
తొలితమకం నీదే తొలితపనా నీకే...
తొలిఉదయం నీదే తొలిపలుకే నీకే...
తొలిగా ఈప్రాణం నీదే తొలితొలి ముద్దు నీకే...
నువ్వు నాకళ్లముందు నీ మాట నాచెవులయందు...
నీ చేయి నాచేతిలోను నా అడుగు నీజాడల్లో....
నా హృదయం నీగుండెల్లోనూ ఉంటే ఇంకేం కావాలి ఈజన్మకి...
... సిరి ✍️

