హృదయ కోవెలలో
హృదయ కోవెలలో
నా మనసు దోచి మాయ చేశావు
అనుక్షణం నీ అనుభూతులే
మరువలేని మధుర జ్ఞాపకం నీవు
నీవే నా హృదయ కానుక
నా కళ్ళలోని కలలు నీవే
నా హృదయారవిందం నీవే
నా శుభోదయం నీ తలపుతోనే
నా శుభరాత్రి నీ ఊసులతోనే
నువ్వు లేని నేను లేనే లేను
నా చివరి శ్వాస వరకూ నిన్నే స్మరిస్తూ
కొలువై ఉంటా చిరంజీవిగా నీ హృదయ కోవెలలో...