గుర్తింపు
గుర్తింపు
పద్యం:
గొప్పతనము రాదు గుర్తించినప్పుడు
గొప్ప వారి చరిత గోచరించు
గొప్పతనము పోదు గుర్తించనప్పుడు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! మనల్ని ఎవరో గుర్తిస్తే మనకు గొప్పతనం రాదు. ఎవరూ గుర్తించకపోయినా మన గొప్పతనం పోదు. గొప్పవారి చరిత్ర ను ఎవరూ చెప్పక్కర్లేదు మన కళ్లముందే గోచరిస్తుంది.