STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

గిరిజాశంకర

గిరిజాశంకర

1 min
153

*గిరిజాశంకర*


పరమేశుడ వీవె!

కరుణావార్థివీవె!

లయకారుడవీవె!

శ్రేయమొసంగరావె!

గిరిజాశంకరా!శివా!


కరిచర్మాంబరధర!

హరహర!గంగాధర!

దరిగొని బ్రోవరా!

పరమును జూపరా!

త్రిపురాసురసంహారా!శివా!


జయమని పల్కెద!

నియతిగ కొల్చెద!

దయగొను దేవరా!

భయమును బాపరా!

తరుణేందుశేఖరా!శివా!//


Rate this content
Log in

Similar telugu poem from Classics