Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravi Sarma

Abstract

4.0  

Ravi Sarma

Abstract

గగన విహారి

గగన విహారి

1 min
269


ఓ నేస్తమా ! చూస్తున్నా !

సెగల పొగలు మాయమైన వైనాన్ని

రోజూ చూస్తున్నా .

ప్రాణాంతక వైరస్ గమనాన్ని

నిస్సహాయంగా వీక్షిస్తున్నా .

కుట్రలా , కుతంత్రాలా ,

నరుని అలౌకిక ఆహారపు అలవాట్లా ,

వ్యాధికి కారణాలేవని

జ్ఞాననేత్రాలతో శోధిస్తున్నా .

అమాయక జీవుల మరణాన్ని ,

నివారణా విధానాన్ని గమనిస్తున్నా .

దేశ నాయకుల , సేవకుల కష్టాన్ని

కడు బాధతో అవలోకిస్తున్నా .

వ్యామోహపు విహారాల్ని ,

వాహనాల వాడకాన్ని

కట్టడిచేసిన నీ ఔదార్యాన్ని శ్లాఘిస్తున్నా .

మానవజాతి ఏకమై , పోరాటానికి మమేకమై

వినాశకర , అనారోగ్యకర కార్యకలాపాల్ని

అడ్డుకోవాలని , నిర్మూలించాలని కోరుతున్నా !!

*** *** ***



Rate this content
Log in

Similar telugu poem from Abstract