గెలిచాడు-ఓడాడు
గెలిచాడు-ఓడాడు
ఆశల నిచ్చెన ఎక్కాడు
రాజకీయ చదరంగపు పావులు కదిపాడు
చెట్టు కింద పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా ఎదిగాడు
ఎందరినో గెలిచాడు
మరెందరినో ఓడించాడు
లొంగని వారిని దండించాడు
కానీ తనను తను గెలవలేక
నేనే నాయకుడినైతే అంటూ కన్న కలలు
నెరవేర్చుకున్నాక తనొక
వ్యాపారి అయ్యాడు
ప్రజా సేవ మరిచాడు
ఓటమికి సిద్ధమయ్యాడు
