గాయమేది
గాయమేది
కంటిచాటు చుక్కకన్న..వేదించే గాయమేది..!
గుండెగువ్వ ఘోషకన్న..ఓదార్చే గేయమేది..!
ఎదురుచూపు మాన్పరాడు..ఎవ్వరితో చెప్పుకోను..
మనసు పడే గొడవకన్న..బాధించే నరకమేది..!
చెలి కన్నుల అనురాగం..మరువలేని పరిమళమే..
ఆ చూపుల వానకన్న..మురిపించే స్వర్గమేది..!
యతిప్రాసల సంగ్రామం..చెలిమిగీతి కవసరమా..
మౌనమైన ఊహకన్న..అలరించే పద్యమేది..!
హృదయానికి నైవేద్యం..హృదయమనే భావింతును..
ప్రేమపూల తోటకన్న..బ్రతికించే సత్యమేది..!

