STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎవరివో‌...

ఎవరివో‌...

1 min
399

అందాల లోకంలో విహరించే దేవకన్యవా

నీ అందాల అంతఃపురానికి యువరాణివా


 తరగని చెరగని కావ్యానివా

కనులు కోరుకున్న తీరానివా


మదిని మురిపించే రూపానివా

మనసును తట్టిలేపే కిరణానివా


తొలిసంధ్యలో ఎర్రని మందారానివా

మలిసంధ్యలో తెల్లని నవమల్లికవా


గలగలపారే సెలయేరవా

మిలమిల మెరిసే నక్షత్రానివా


మంచు కడిగిన ముత్యానివా

హిమములో రాలే సుమానివా


వాసంత సమీరానివా

హేమంత తుషారానివా


వీణవేణువైన సరిగమవా

శరత్కాలపు చంద్రికవా


ఎవరివో........ నీవు

ఎవరివో............ 

నా మనసును దోచిన

వన్నెచిన్నెల వయ్యారానివా

నా కనులు ఎపుడూ కనని

దేవలోక సౌందర్యానివా


Rate this content
Log in

Similar telugu poem from Romance