ఎంత కష్టమో
ఎంత కష్టమో
మనిషిగ పుట్టీ మనిషిగ పెరుగుట ఎంత కష్టమో !
చూసిన ప్రతిదీ కోరిన దక్కుట ఎంత కష్టమో..!
లాభం నష్టం లెక్కలు చూసే తిక్కను వీడు..!
ప్రేమను పంచే మనిషిని తెలియుట ఎంత కష్టమో..!
ఆజ్ఞా చక్రపు జాడను కనవోయ్ సత్యం దొరుకును..!
కన్నులు రెండూ మూయగ నిలచుట ఎంత కష్టమో..!
అమ్మా..నాన్నా జన్మను ఇచ్చిన దేవుళ్ళే..నీవో..?!
చక్కని దైవం..నిజమను సంగతి నమ్ముట ఎంత కష్టమో..!
సుఖములు.. బాధలు నేర్పును ఎన్నో తియ్యని పాఠాలు..!
జ్ఞానం పంచే అనుభవ సారం గురువుగ తోచుట ఎంత కష్టమో..!
