STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ఏమాంటావు

ఏమాంటావు

1 min
5


నీ గురించి చెప్పడానికి

మాటలు కోకొల్లలు...

నీ మనసు గురుంచి చెప్పడానికే

అక్షరాలు సరిపోవట్లేదు...


తారలకి దక్కని అందం నీ సొంతమని

చందమామ నీ మోము అని

ఆ కురిసేవాన సవ్వడి నీ నవ్వు అని ...

తెల్లని మంచు నీ మనసని...

ఎన్నని చెప్పను... ఎంతలా వర్ణించను...


నువ్వు నవ్విన ప్రతిసారి...

ఒక కొత్త కావ్యం పుట్టుకొస్తుంది...

నువ్వు పాడిన ప్రతిసారి...

ఒక కొత్త రాగం పురుడు పోసుకుంటుంది...

ఇక నువ్వు నాతో మాట్లాడిన ప్రతిసారి...

స్వరాల వెల్లువ మొదలై... మది పులకరిస్తుంది...

నువ్వు నాతో జతగా ఉన్నప్పుడు...

మరో కొత్త ప్రపంచం నా సొంతం అవుతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Romance