ఏకం
ఏకం
ఏడేడు జన్మల బంధం
నీది నాదంటూ..
కోటి ఆశల మేఘాలపై
కొత్త జీవితమంటూ..
పైపై వలపుల భ్రమల్లో
నిండా ముంచేసింది..
ఏడేడు జన్మల బంధం నీది నాదంటూ కోటి ఆశల మేఘాలపై
కొత్త జీవితమని భ్రమల్లో నిండా ముంచేసింది
ప్రేమ ప్రపంచంలో జంటగా
ఎగిరిన ఆనందం..
ఆకాశంలోనే ఆవిరై
ఒంటరిని చేసి తనపై..
పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ స్వార్థం తాడుతో..
ఉరికొయ్యకు వేలాడేసి అలవాటుగా నవ్వుకుంటూ వెళ్ళిపోయావే..
మనసు పలికిన మౌనగీతం
వీనులకు వినపడునా..
నిశ్శబ్దం రాసిన కవిత కనులకు చీకటిని పంచింది..
తేనెల నవ్వుల కత్తితో పొడిచిన సంగతి తెలియలేదే..
నీ మాయల ఊబిలో పీకల్లోతు ప్రేమలో కూరుకున్న ఫలితం..
నీ సాన్నిధ్యంలో నన్ను నేను
మరిచి పోయాగా..
చేసుకున్న బాసలు మూగరోదనలై
గుండెలు మండగా..
చెప్పుకున్న ఊసులేమో
నీటి మీద రాతలాయెగా..
ఏకం కావల్సిన కాగితం అక్షరం ఆనవాళ్లే లేకుండా చించేసావు..!
