ద్రోహం
ద్రోహం
మాట ఇవ్వడం సులభమే
పదిమందిలో గొప్ప కోసమో
పని అయిపోవాలన్న స్వార్థమో
ఏదో మాట చెప్పి మైమరపించాలనే భావమో
కానీ ఇచ్చిన మాట మీద నమ్మకం
తమ పనికి భరోసా లభించిందన్న ఆనందం
మాట పొందిన వారిలో
మాట తప్పిన రోజు
మనిషి స్వార్థం తెలిసిన క్షణం
ఆవేశం కదం తొక్కుతుంది
ఆక్రోశం గుండె నిండుతుంది
మరోసారి మళ్ళీ నమ్మకమనే భావన
మనసులో చచ్చిపోతుంది
మనిషిగా మనిషి మీద నమ్మకం పోతుంది
మాట ఇచ్చినంత తేలిక కాదు
నిలబెట్టుకోవటం
మనిషిగా జీవితంలో
మాట మీద నిలబడాలనే
గుణం కలిగి ఉండాలి
అంతే కాని ఇబ్బంది పెట్టడమో
ద్రోహం చేయడమో మనిషికి తగదు
