ఏదో తెలియదు
ఏదో తెలియదు
గుండెల నిండా మోయ్యలి బాధ.
అనుభవించాలి నరకయాతన.
ప్రతిసారి కన్నీటి ప్రవాహం తడిసిపోవాలి.
శూన్యపు దారులు.
మది నిండా ఆలోచనలతో గుచ్చి గుచ్చే వేల ప్రశ్నలు.
నిశబ్దం కూడ భయపెడుతుంది.
నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఓ చిన్నా చినుకు ఓ పిడుగు శబ్దమై వినబడునడుతుంది.
మేలిపెడుతుంది దేహాన్ని.
ఒంట్లో శక్తి ఓపిక లేదు.
అంతా అల్లకల్లోలం గా మారిపోయింది.
కంటికి నిద్ర లేక చేస్తున్నా సావాసం.
కనుమరుగైపోతుంది ఏమో తెలిసిరాకుంది
బలమవుతానో బలహీనమవుతానో తెలియదు చివరికి.
