బాల్యం
బాల్యం
1 min
0
బాల్యమంటె కదలివచ్చు చైతన్యపు కలలపంట.
బాల్యమంటె విరబూసే కలువలంటి కనులపంట.
చిందులేయు సరిగమలతొ నాట్యమాడు మయూరమే...
ఆశలంటి అడుగులతో ఆశయాల విరులపంట
చదువు సాధనుంటేగా లోకములో వెలుగు నీవు....
ఫలియించును కోర్కెలన్ని , కలిగించును సిరులపంట..
నిజాయితీ వ్యక్తిత్వము, విలువలంటె మానవతే.
నీడనిచ్చు పరులకంత గొడుగునీడ తరులపంట...
తరుణ కిరణ ప్రభాతమే నీ భవితయె చూడు బాల!
ప్రకాశించు వెన్నెలగా సాగిపోవ సరులపంట....
