STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

దీపాలము

దీపాలము

1 min
7


నీవు-నేను ప్రేమగుడిని..వెలుగుతున్న దీపాలము..!
ఒకరికొరకు ఒకరు పుట్టి..కలుసుకున్న దీపాలము..!

సంసారపు కథలసాక్షి..స్నేహగీతి సరిగమలం..
మౌననిధీ రసస్యాలు..పాడుతున్న దీపాలము..!

చుట్టునున్న జగమంతా..నిజమాయా మందిరమే..
సకలజీవ భావనలను..చూచుచున్న దీపాలము..!

చిత్తమైన వృత్తులైన..చిత్రమైన చోద్యాలే..
విషయవాసనావృత్తులు..కాల్చుతున్న దీపాలము..!

తెలిసికూడ తెలియనట్లు..ఉండటమే తగదు కదా..
పరితాపము లణగించగ..నడుస్తున్న దీపాలము..!

ఆశలెల్ల తీర్చుకునే..ఆశయాల దారిలోన..
ఇద్దరమూ ఒక్కటిగా..బ్రతుకుతున్న దీపాలము..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics