ధ్యానమంటే
ధ్యానమంటే
మైలురాళ్ళను నిదురపుచ్చే బ్రహ్మ విద్యయె ధ్యానమంటే..!
తలపులన్నీ సరిగ నిలిపే సత్య సాధనె ధ్యానమంటే..!
నామ స్మరణకు తావునివ్వక సాక్షితత్వపు సాక్షి కావలె..!
ఆత్మజ్ఞానపు దారి జరిగే నిత్య శోధనె ధ్యానమంటే..!
రెండు కన్నులు మూసి హాయిగ గంట సమయం ఇవ్వవలెగా..!
వెర్రి కోకిల మనసు పాటను కట్టిపెట్టుటె ధ్యానమంటే..!
భజన జపములు కాలయాపన..వృథా శ్రమలే మిగులు చివరకు..!
శ్వాస పట్లే తదేకముగా ధ్యాస ఉంచుటె ధ్యానమంటే..!
జన్మజన్మల బాధలైనా వ్యాధులైనా మాయమవ్వును..!
ఎరుకతో మరి కర్మచక్రము నిలుపు మార్గమె ధ్యానమంటే..!
