STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

దేవరీ

దేవరీ

1 min
8


కస్తూరీ తిలకమద్ది పాలభాగ మందునీవు
శూలపాణి కౌమారుని తేజముతో విరాజిల్ల
నండూరీ ఎంకివోలె బావమనసు తస్కరించి
సంచరించు పూబోణీ నామనసున దేవేరీ 

పాలబుగ్గ దిష్టిచుక్క సుందరంగ తీర్చిదిద్ది
సూర్యోదయ కాంతియిదే యనిచెప్పగ చెప్పకనే
తామరాకు నీరువమూ ముచ్చటగా జారనిచ్చి
ననుతాకక దూరమద్ది విరహమిచ్చు వాంఛితా

వాలుచూపు వన్నెలద్ది చిరునగవుల తోడనీవు
మనసుందని నాపైనా కొసరినావు వలపుజూపి
కనురెప్పల దాల్పులందు కనుగుడ్లా చందమునా
ముత్యమున్న ఆలుచిప్ప రక్షనిత్తు వాడనులే 

నీలినీడ నీవేణీ జాబిల్లులు మల్లెపూలు
అందునేను సౌగంధం పరవశమిడు వెన్నెలనే
చంద్రికలే నీకన్నులు అందునేను పట్టుపురుగు
నీతనువూ ధరియించే పట్టుచీర పట్టుపోగు 

లవలేశం ఐనాగాని ప్రేముందని తెలియజేయ
ఆహేతూ హిమాచలమంతనేను తిరిగినట్టు
ఆసేతూ బంధనమూ మనమనసులు కలిసినట్టు
అజరామర మనబంధం కొనసాగీ తీరునులే 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics