Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

దైవత్వం

దైవత్వం

1 min
3


మతృత్వపు మాధుర్యం..పంచడమే దైవత్వం..!

మాట్లాడుతు మౌనంలో..ఉండడమే దైవత్వం..!


సత్యమెఱుక కాకుండా..శాంతమెలా చేకూరును.. 

తానెవరో సరిగ తెలిసి..బ్రతకడమే దైవత్వం..! 


మనం కోసి ఇచ్చు పూలు..కోరు దైవ మెక్కడుంది.. 

ప్రతి జీవిని తన సమముగ..చూడడమే దైవత్వం..! 


కోరికతో దీపాలను..వెలిగించే దెవ్వరికోయ్.. 

వెర్రిముసుగులన్ని కాల్చివేయడమే దైవత్వం..! 


మనషికన్న హింసాత్మక..లక్షణాల జీవి లేదు.. 

దివ్యమైన అమాయికత..కాచడమే దైవత్వం..! 


స్త్రీయెఆది పరాశక్తి..సాధికారతేమి టసలు.. 

తన మాధవ తత్వమెరిగి..నడవడమే దైవత్వం..!


Rate this content
Log in

Similar telugu poem from Classics