STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

,చూడను

,చూడను

1 min
11


తడబడు మాటల..పొగడగ చూడను..! 
పాటల నదిలా..పొంగగ చూడను..! 

కన్నుల గుడిలో..వెన్నెల మడుగే.. 
తరగని నిధినే..మరువగ చూడను..! 

చిక్కని చక్కని..చిన్నది నవ్వెను.. 
మెఱుపుల మొగ్గలు..కోయగ చూడను..! 

ఆశల మబ్బుల..పయనం ఎటకో.. 
ప్రశ్నల గదిలో..నిలువగ చూడను..! 

సుఖమది వెతికే..పనియే దండగ.. 
భ్రమలో మదినే..ఉంచగ చూడను..! 

గజలుకు ప్రౌఢత..దిద్దుట ఎటులో.. 
ఊహకు హద్దులు..పెట్టగ చూడను..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics