చోటుండదు
చోటుండదు
పగలనీకు నీగుండెను చెలియకచట చోటుండదు
సడలనీకు నీసహనం శాంతికచట చోటుండదు
పుట్టినూరు వదలిపోతె నీవెవరికి ఏమికావు
వీడిపోకు నీ స్థానం పరువుకచట చోటుండదు
జీవితమే పోరాటం వెనుతిరగక సాగాలీ
ఓడనీకు నీసమరం గెలుపుకచట చోటుండదు
అనుకున్నది సాధించే గమ్యాన్నే చేరాలీ
ఆగనీకు నీపయనం మలుపుకచట చోటుండదు
ఆత్మతృప్తి లేనిబ్రతుకు నిస్సారము కద"చల్లా"
చెదరనీకు నీస్థైర్యం ఓర్మికచట చోటుండదు
