STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

చిలకమ్మా!చెప్పవమ్మా!

చిలకమ్మా!చెప్పవమ్మా!

1 min
3

చిలకమ్మా!చెప్పవమ్మా!

(కవిత )


పచ్చపచ్చాని పొలంలో నా మావ 

 బంగారాలు పండించే నా మావ 


పట్టుచీరలు తెస్తానన్న నా మావ 

పగలే వెన్నెల కురిపించే నా మావ 


ఎద్దుల బండిలో నిన్నెక్కించి నే 

నెగరేసుకుపోతానన్న నా మావ 


ముద్దుగా ముచ్చట్లాడే నా మావ 

బుంగమూతి పెట్టిండు నా మావ 


కొర్రమీను కూర తెస్తే నా మావ 

కూడు తినడేమిటో నా మావ 


పంటచేల మధ్యలో నా మావ 

పరధ్యానంగా నున్నాడు నా మావ 


చెలి చెంతకు నా మావ రాడేలనమ్మా!

చిలకమ్మా!నీవన్నా!కాస్త చెప్పవమ్మా!//



Rate this content
Log in

Similar telugu poem from Classics