చీరకట్టు
చీరకట్టు
*చీరకట్టు*
(వచనకవిత)
అతివల కందము పెంచెడి చీరకట్టు
ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, కంచిపట్టు
ఏదైనా కానివ్వండి!బెళుకును జూపెట్టు!
దానిమీద తొడిగితే సొగసైన జాకెట్టు
మతిపోవు సుమండీ!మీమీదొట్టు!
సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టు
హుందాతనంలో విశ్వానికే సామ్రాట్టు
పురుషుల హృదయాలను కొల్లగొట్టు
నేటికీ మొదటి వరుసలో పరిగెట్టు
చక్కగా చీరను కట్టి ఫాలములో బొట్టు
చిక్కగా తురిమిన పూలతోడ తలకట్టు
కదిలెడి మనదేశ మహిళామణుల జట్టు
దేవతలనబడగా జగతి మొత్తం జైకొట్టు!
నూతనమైన వెఱ్ఱి పోకడలను వెనక్కు నెట్టు
మన దేశపు గౌరవానికి చిహ్నమీ చీరకట్టు
భరతమాత కీర్తిని గగనంలో నిలబెట్టు
అమ్మతనముకు చిరునామాగా జేపట్టు
పరమాత్మకు ప్రీతిని గూర్చెడి మడికట్టు
విలక్షణమై ప్రతియొక్కరి మనసునాకట్టు
మన పెన్నిధిగా శాశ్వతమైనదీ చీరకట్టు. //
