చెలి చూపులో
చెలి చూపులో
చెలిచూపుల తోటనుండి..వెళ్ళాలని లేదు..!
తన మౌనపు కోవెలయే..వీడాలని లేదు..!
ఈ మాటల ఊటంతా..తెలియనిదా తనకు..
తనను గూర్చి గాక ఏమి..పాడాలని లేదు..!
చెబుతున్నది చెప్పినదే..చెప్పకనే వినగ..
తన వెన్నెల వెలుగునదిని..దాచాలని లేదు..!
పంచుకోను చేతకాని..తనమేమో ఏమొ..
తన ప్రేమకు నిర్వచనం..ఇవ్వాలని లేదు..!
కన్నులింట మందిరాన..కదలకుంది తాను..
తన పదముల జాడగాక..నడవాలని లేదు..!