చదువు
చదువు
చదువుకోవయ్య!బుద్దిగ భవిత వెలుగంగ!బాలా!
సద్గుణము లెన్నియో నీకు కలుగంగ!బాలా!
గురువు చెప్పిన పాఠము గుర్తు పెట్టుకోవయ్య! బాలా!
మఱచి పోక మంచిగా నెదిగిపోవయ్య! బాలా!
దేశదేశములందునీ కీర్తి వెల్గవలయు బాలా!
వాసిగా మన జాతిమెచ్చగ నిల్చి యుండుము బాలా!
విద్యాధనము కూడబెట్టుకో బాలా!
వెలగట్టలేనిదీ విద్య తెలిసికో బాలా!
పంచుచుండిన పెరుగు చుండునీ విద్య బాలా!
మంచి దారిని చూపెడిదీ విద్య బాలా!
వినయసంపద యున్నచో విద్యనిల్చును బాలా!
ధనము కన్నను గొప్పదీ దైవరూపము బాలా!
