STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చావుతో సరసం...

చావుతో సరసం...

1 min
354


అవిగో స్మశానాలు 

ఒంటరిగా....

బొమికలు నిండిన సమాధులు 

నిశ్శబ్దంగా....

నా గుండె ఆ వంతెన గుండా కదలి పోతూంది

ఆ చీకటిలో..

కఠిన చీకటిలో...

పడవ ప్రమాదంలో మనలోకి మనం చొచ్చుకున్నట్టు

మన గుండెలో మనం కూరుకున్నట్టు

మన చర్మాన్ని వీడి 

మన ఆత్మలోనే మనం దూరినట్టు


అవిగో శవాలు.....

మంచుతో.కాళ్ళు చేసినట్టు

మట్టితో పాదాలు అతికి

ఆ బొమికల్లో చావు ఒదిగి

కుక్కలు లేని మొరుగుల్లా

నక్కలు లేని ఊళల్లా

ఆ తడి గాలిలో తేలియాడుతుంది చూడు

వర్షపు కన్నీటిలా...


చావు వస్తూంది ఏదో శబ్దపు చాటున

పాదం లేని బూటులా

నువ్వు లేని నీ సూటులా

తలుపు తడుతూంది

 రాయిలేని ఉంగరంతో

వ్రేలు లేని రాయితో

వచ్చి అరుస్తూంది

 నోరు లేకుండా....

నాలుక లేకుండా....

స్వరపేటికె లేకుండా...

అయినా దాని రాక వినిపిస్తూనే వుంది 

కొమ్మ వీచిన శబ్దంలా

నీ చొక్కా విసిరిన గాలిలా


చావు ప్రయాణిస్తూంది 

చీపురులా!

భూమిపై శవాలను చిమ్ముకుంటూ

చీపురులోనే దాగివుందేమో చావు


చావు మడత మంచాలలోనూ ఉంది

బలవంతపు వలపు క్రీడలోనూ వుంది 

పరుపులలో దాగివుంది

నల్లని దుప్పట్ల క్రింద !

ఎప్పుడో ఆగిపోతుంది వూపిరి

సర్వత్రా వ్యాపించి ఉన్న

చావుతో సరసాలా!

      

    ..., సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance