బుడుగు జీవితం
బుడుగు జీవితం
బడుగు జీవితం......!!!
అభాగ్యుడు....అనాధ
యాచకుడు.... బిచ్చగాడు
ముష్టి వాడు......బీదవాడు.....
వీళ్ళు మనుషులే !
దేవుడు ఈ రూపాన్ని
సృష్టించక పోతే మనిషిలో
జాలి భావం కూడ లేకుండా బ్రతికేయాలనీ
బయలుదేరి బడుగు జీవితాన్ని
మానవుడు మరచిపోయే వాడే!
మనిషికి స్వార్థం లేకుండా
ఏ పని చెయ్యడు
స్వలాభం పొందాలని...
స్వంత పేరు రావాలని...
పదిమందికి చెప్పాలని...
పాట్లు పడేవాడే!
అన్నం మెతుకులు
పంచుతాడు....కాని
దానికి రుజువులార్ధం
చిత్రాలు తీసి పదిమందికి
చెప్పుకుంటూ చేస్తాడు....
దానాలన్నది
దాపరికం కాకపోయినా
దయాగుణంతో చేసేదానికి
ప్రాచుర్యము అనవసరం...
పూర్వపు కాలంలో
గురుకులంలో
గురుదక్షిణకు ఆశించకుండా
దానం చేసినది విద్య...విజ్ఞానం
ఇప్పటి రోజుల్లో మనకు
తహత్తు లేకపోయినా
లక్షలు పెట్టి విద్యను
అమ్ముడు పోయేలా చేస్తున్నాం
మనం బడుగు జీవితాన్ని
అనుభవిస్తూ...అగ్రవర్ణ
ఆస్తి పరులకు కట్టే సొమ్మును
వారి సంపదకు చేయూతనిస్తున్నాం
అంటే రోడ్డున పడి పైసా కోసం
బాహటంగా అడిగినవాడు
మన దగ్గర బడుగు వాడు
బలహీనుడు......
బలం ఉండి బలగమున్నా
దేవుడు సృష్టిలో అందరూ
బలహీనులే బడుగు జీవితాలే
ఒకరు చెట్టుకింద హాయిగా
ఊపిరి పీలుస్తూ బ్రతుకుతూ ఉంటే
చల్లని యంత్రాల నడుమ
ఊపిరి లేకపోయినా
కృత్రిమ గాలిని పీలుస్తూ
దేవునిముందు
సాష్టంగముతో చేతులెత్తి
అడుక్కునే బిచ్చగాడుగా
మారిపోయే ఖర్మలో
వాడు బ్రతికేది దేవుని ఎదుట బడుగు జీవితమే.......
