STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

బ్రతుకు

బ్రతుకు

1 min
3

ఎదురీత తలరాత రాసేసి పోతావు

ఎదకోసి మంటల్ని రాజేసి పోతావు


మనసులో సడి నీవు బంధాల తడి నీవు

మురిపించి ముడివేసి తెంపేసి పోతావు


అలిగి పోనని తెలుసు అడగలేనని అలుసు

అలసిపోయిన ఆశ చిదిమేసి పోతావు


 తెరలు తొలిగేవేళ వెలుగు చీకటి ఆట

 తిమిరాల చెరలోన వదిలేసి పోతావు


 కన్నీటి బరువెంత నేమోయలేనంత

 భ్రమలు తీరని బతుకు బలి చేసి పోతావు


 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics