బ్రతుకు నాణెం
బ్రతుకు నాణెం
ఏటిలో నీరు ఇంకిపోయే
ప్రతి దినం వేడి తగలి రాళ్లు ముక్కలాయే...
పండిన పంట ఎండిపాయే...
భూమాత నెర్రెలు చీరి...
దాహంతో ఆకాశం వైపు చూసే...
ఎన్ని కష్టాలొచ్చిన చిరునవ్వు మోమున పూయించే,
రైతన్న... హృదయం బద్ధలాయే...
పశుగ్రాసం దొరకక వాటిని కూడా...అమ్మేశాడాయే...
అప్పు తెస్తే ఆ వడ్డీలు తడచిమోపుడాయే...
తినడానికి గింజ కరువాయే...
చూడంగా... చూడంగా...
ఉన్న శరీరం కాస్తా వెన్నెముకకు అతుక్కుపోయే...
చెమట చుక్క కాస్తా నేలను తడిపే...
అయినా... గంజి దొరకలేదు...
ఎదురైంది మాత్రం నిరాశే...
ఇప్పుడు చూస్తున్నది...
ఎండుతున్న ఆకులు... రాలుతున్న బ్రతుకులు...
ఏనాటికి మారునో... ఈ బ్రతుకు నాణెం...
ఎప్పుడు చూడూ... కష్టాలున్న వైపు మాత్రమే చూపిస్తుంది...
సుఖ సంతోషాలను ఎప్పుడైనా చూపిస్తుందేమోనన్న ఆశ..
