STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

బ్రతుకు భవితకు దారి

బ్రతుకు భవితకు దారి

1 min
325

బ్రతుకు భవితకు దారి చూపిన హితులనెప్పుడు తలచుకోనువు

భువన తలమున భవ్యరీతుల అందలాలకు చేరుకోనువు


నింగి వెలిగే సూర్యచంద్రుల

కాంతిపుంజమె జగతి నిల్పును

అంధకారపు అడుగుజాడల

మగ్గువారిని ఆదుకోనువు


కారుమబ్బులు ముసురుకుంటే

వరద రాకకు సూచనేనా

కష్టమేదో సౌఖ్యమేదో

ప్రీతి తోనే హత్తుకోనువు


 

బతుకు తెరువులు లుప్తమైతే

తోటివారిని నింద చేయకు

బండ్లు ఓడలు గాకపోవును

మంచితనమున మసలుకోనువు


చింత చేస్తే కలతలేవీ

చెంత వీడీ తొలగిపోవున

తీరు మార్గపు దారి యేదో 

శాశ్వతంగా తెలుసుకోనువు


ప్రతిభ లేవో ఒకరి పరమా..

చిన్నబుచ్చకు ఘనుడివైనా

అన్నదాతల కష్టజీవుల 

నిత్యశ్రమలను మెచ్చుకోనువు 


మహా వృక్షం ఛాయపడితే

చెట్టు యేదీ ఎదగదంటరు

కాపుగాచే నేస్తమోలే

'మధు'ర హితములు పంచుకోనువు 


 బ్రతుకు 

     06/08/23.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics