బోనాలు
బోనాలు
బోనాలు
(తేటగీతి పద్యములు )
ఎల్లలన్నేలు చుండెడి దీశురాణి
పిల్ల పాపలన్ బ్రోచును బ్రీతితోడ
మంగళంబుగ బోనాలు మాతకిడగ
తరతరంబులు వృద్ధితో తనరుచుండు.
ఆడుబిడ్డలు పుట్టింటి కాదరముగ
వచ్చి చేసెడి దివ్యమౌ పర్వమిదియె
సంబరంబుగ పడుతులు చద్ది పెట్టి
పున్నెముల్ పొంద కాళికి మ్రొక్కుచుంద్రు.
జగతి కాధారమౌ దేవి శాంతి నిలయ
వేన వేలుగ తరుణులు వివిధగతుల
పూజలన్ సల్పి వేడుచు పుణ్య నిధిని
పసుపుకుంకుమల్ పొందుచు వరలుచుంద్రు.
జయము జయమంచు తల్లిని సన్నుతించి
భక్త సముదాయముల్ కొల్వ వాంఛ తీర్చి
మందహాసమున్ జిల్కుచు మనికి నిల్పు
పార్వతీ దేవి కిత్తును వందనములు .//
