బంగారు పాపాయి
బంగారు పాపాయి
అమ్మమ్మని లడ్డులు కాజాలనడుగుతా
అమ్మని బొమ్మల
బుడ్లనడుగుతా
అన్నని పిజ్జా
బర్గర్లనడుగుతా
అక్కని గౌనులు
రిబ్బన్లనడుగుతా
అవ్వని ముద్దుగ
పేణీలనడుగుతా
అత్తని రంగుల గాజుల్నడుగుతా
అడిగినవన్నీ ఇవ్వక పోతే
అలకల తో నేనెళ్ళి పోతే
అమ్మా నాన్న వస్తారు
అడిగిన వన్నీ తెస్తారు
అలరులు కురిసెడి పాపాయిని
అవనికి సిరివంటి బుజ్జాయిని.
