బాల్యము
బాల్యము
అల్లరి యాటల బాల్యము
తల్లిని వదలని బాల్యము
కల్లల నెరుగని బాల్యము
బిళ్ళంగోడుల బాల్యము
గంతులు వేసే బాల్యము
వింత పోకడల బాల్యము
చింతకు దూరము బాల్యము
సంతసమిచ్చెడి బాల్యము
పలకలు మోసే బాల్యము
కిలకిల నవ్వుల బాల్యము
కలతల నెరుగని బాల్యము
చిలిపి చేష్టల బాల్యము
కుదురు లేనట్టి బాల్యము
వదలని నేస్తము బాల్యము
చదువును నేర్పే బాల్యము
ముదముగ సాగే బాల్యము
పరుగులు పెట్టే బాల్యము
వరముగ దొరికెడి బాల్యము
మఱచి పోలేని బాల్యము
మరలి రానట్టి బాల్యము
---------------------------
