అత్తగారు
అత్తగారు


అవనికి ప్రతిరూపం ఆమె
అందుకు కారణం తన తనయునితో పాటు
ఆవలి తీరం నుంచి వచ్చిన మరో
అమ్మ తనయ కూడా తన బిడ్డయేగా
పుత్రుని శ్రేయం కోరే తల్లి
పుట్టించవలదు ఎటువంటి నిందా
పుత్తడి బొమ్మంటి ఇల్లాలి మీదా
పునీతమైన సాటి స్త్రీ పైనా
కొడుకు కోడలు కలకాలమ్మూ
కలిసుంటేనే కళ్యాణానికి అర్థమ్మూ
ఒకరికొకరు శతృవైతే ఒరిగేదేమిటి
ఒంటరి వాడై కడకూ కొడుకూ ఏడ్చుటె తప్పా