అంతరంగం
అంతరంగం
అంతరంగం అల్లకల్లోలమే
నిలకడలేదేమి ఎందుకనో
కడలి తరంగాలు ఉవ్వెతున
ఎగసి పడ్డట్టు హృదయాంత
రంగమున ఆలోచనల సవ్వడి
ప్రశంతత అదుపు కోల్పోతుంది
మేఘ మాల మనసు భారమైతే
చిరు జల్లుల వర్షం కురిసెనేమో
సుకుమారి తరుణి హృదయం
గాయమైతే కన్నీటి బిందువులు
నును చెంపలను స్ర్ఫుశిస్తుంది
కాలమంతా తరిగి పోతున్నా నా ప్రేమ
కలగానే మిగిలింది తీరం చేరక
అలసి కను రెప్పల్లో మౌనంగా ఒదిగి
పోయింది కన్నుల నీరు ఉప్పెనై చెంపల్లో
జారి ఎండిన ఏరై చీరలో కలిసి పోయెనా
ప్రేమ రాలి పోయే ఆకు కాదు
సహనంతో ఎదురు చూస్తే
మళ్ళీ మళ్ళీ చిగురిస్తూ
వసంతాలు కురిపించదా
కరిగే కాలమా గుర్తుకు రానా
క్షణమైనా నీ వెంట సాగనీయ్!!!!

