STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా

1 min
290

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవిత గ్రంధం


నన్ను చేరితే నీ అదేలసవ్వడి లో ఓ రాగం

నా మనసులో విరిసే ఆలనాటి బృందవనం

నన్ను తాకితే నీ కన్నుబోమ్మల విల్లు నుండి ఓబాణం

ఆనంద డోలికాలు ఊగే నా హృదయం

నన్ను తాకితే నీ చిరునవ్వుల కడలి లో ఓతరంగం

నా ఈ జన్మంతా నీకు దాసోహం

నేను పొందగలిగితే నీ మాటల పాలసంద్రం లోనిఅమృతం

హాయిగా సేవిస్తాను ఈ నిరీక్షణ హాలాహలం

నాకు అందితే నీతో కొన్ని క్షణాలు గడిపే వరం

నిలుపుతాను నా హృదయాలయం లో నీ రూపం

నాకు ఇవ్వగలిగితే నీ నూరేళ్ళ ప్రేమ సంతకం

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవితగ్రంధం...!!!

   


Rate this content
Log in

Similar telugu poem from Romance